తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..

Teachers Should Submit Details of Assets to Govt
x

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..

Highlights

Education Department: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక జీవో జారీ చేసింది.

Education Department: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక జీవో జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు వెల్లడించాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా వివరాలు చెప్పాలని, అలాగే ఏడాదికోసారి ఆస్తుల వివరాలు సమర్పించాలని టీఎస్‌ విద్యాశాఖ స్పష్టం చేసింది. టీచర్ లకు, ఉద్యోగులుకు ఇన్ స్ట్రక్షన్ ఇవ్వాలని RJDలు/DEO లకు శనివారం ఆదేశాలు జారీ చేసింది.

ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే..స్థిర / చర ఆస్తులు కొనుగోలు / అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. ఇన్నేళ్లు ఉపాధ్యాయుల విషయంలో అంతగా పట్టించుకోని విద్యాశాఖ.. నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్సు శాఖ రిపోర్ట్ ఇవ్వడంతో విద్యాశాఖ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories