Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట వద్ద టీచర్ల ఆందోళన

Hyderabad: రోడ్డుపై బైఠాయించిన టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

Dhatripriya
Published on: 22 Jan 2023 5:14 PM IST
Teachers Agitation At Panjagutta Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట వద్ద టీచర్ల ఆందోళన

Hyderabad: హైదరాబాద్ పంజాగుట్ట వద్ద రోడ్డుపై బైఠాయించిన టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవో 317 వల్ల 2017 బ్యాచ్ మొత్తం నరకం అనుభవిస్తున్నారన్నారు. చదివింది ఒక జిల్లా ఉద్యోగం వందల కిలోమీటర్ల దూరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ప్రయాణం చేసి అనారోగ్యంతో బాధపడుతున్నామన్నారు. ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీచర్ల యూనియన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీనియర్లకు ఒకలా జూనియర్‌లకు మరోలా యూనియన్ ధ్వంద్వా వైఖరి చూపిస్తున్నారన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా తమ గోడు వినాలని టీచర్లు ఆందోళన చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story