Nizamabad: మోడల్ స్కూల్ విద్యార్ధినిని చితకబాదిన తెలుగు టీచర్

* సోది క్లాస్ చెబుతున్నారంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థులు.. క్షమాపణ కోరినప్పటికీ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీచర్

R Tripura Malini
Updated on: 30 Nov 2022 1:17 PM IST
teacher assaults students
X

మోడల్ స్కూల్ విద్యార్ధినిని చితకబాదిన తెలుగు టీచర్

Nizamabad: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఓ విద్యార్థిని తెలుగు టీచర్ చితకబాదారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ విద్యార‌్థిపై విచక్షణారహితంగా కర్రలతో టీచర్ మహేశ్వరి చితకబాదారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో టీచర్ సోది క్లాస్ చెబుతున్నారంటూ విద్యార్థి పోస్ట్ చేశారు. దీంతో విద్యార్థిని కర్రలతో చితకబాదారు. పోస్ట్ చేసినందుకు స్టూడెంట్ తల్లిదండ్రులు క్షమాపణ కోరారు. క్షమాపణ కోరినప్పటికీ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీచర్ మహేశ్వరి బట్టలూడదీసి కొడతానంటూ విద్యార్థిపై టీచర్ చిందులేశారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి క్షమాపణ కోరినప్పటికి ఆగ్రహం వ్యక్తం చేశారు.. టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story