TDP Avirbhava Sabha: హైదరాబాద్‌లో నాంపల్లిలో టీడీపీ సభకు ఏర్పాట్లు..

TDP Avirbhava Sabha In Nampally
x

TDP Avirbhava Sabha: హైదరాబాద్‌లో నాంపల్లిలో టీడీపీ సభకు ఏర్పాట్లు..

Highlights

TDP Avirbhava Sabha: ఇవాళ టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం

TDP Avirbhava Sabha: టీడీపీ 41 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలంగాణలో పార్టీని బలపరిచే లక్ష్యంతో ఇవాళ పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో సభ నిర్వహించనున్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇవాళ్టి సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో కొంత జోష్ పెరిగింది. జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయింది. సభకు చంద్రబాబు కూడా హాజరు కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీకి ముందు నుంచి బలం ఉంది. గతంలో టీడీపీ మహానాడు హైదరాబాద్ లోనే నిర్వహించారు. ఇప్పుడు సభతో హైదరాబాద్ లో టీడీపీ పట్టును నిరూపించుకోవాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది. రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సహా దాదాపు 15 వేల మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సభ నిర్వహణకు 12 కమిటీలను ఏర్పాటు చేశారు. కష్టపడి పనిచేసే వారికే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్‌ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ నేతలకు సమాచారం అందింది.



Show Full Article
Print Article
Next Story
More Stories