అది అసత్య ప్రచారం.. తెలగు రాష్ట్రాల్లో పొత్తులపై ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

TDP Alliance with NDA is Just Propaganda Says K Laxman
x

అది అసత్య ప్రచారం.. తెలగు రాష్ట్రాల్లో పొత్తులపై ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Highlights

K Laxman: తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

K Laxman: తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సొంతంగానే అధికారం దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఏపీలో NDAలో టీడీపీ వస్తోందన్న ప్రచారాన్ని ఖండించారు లక్ష్మణ్.. అది కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. అక్కడ పవన్‌కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. జగన్ పట్ల ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుంటామని తెలిపారు. ఇక మునుగోడులో టీఆర్ఎస్ కు లెఫ్ట్ పార్టీల పొత్తు అనైతికమన్నారు. సూది, దబ్బనంతో పోల్చిన కేసీఆర్ తో వారు జతకట్టడం అంటే వారిస్థాయి ఏంటో అర్థమైపోతుందని సెటైర్లు వేశారు. కనీసం ప్రగతిభవన్ ముందు ధర్నాలు చేయనివ్వకపోయినా ఆపార్టీలకు బుద్ది రాలేదని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories