Bhainsa: భైంసా బాధితులను పరామర్శించిన టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌

Bhainsa: సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భైంసా బాధితులు..

Sandeep Eggoju
Published on: 10 March 2021 4:47 PM IST
TBJP Chief Bandi Sanjay Visited the Bhainsa Victims
X

బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Bhainsa: సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భైంసా ఘటన బాధితులను పరామర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. బాధితులు విజయ్‌, దేవారెడ్డి కోలుకుంటున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 6 ప్రాంతాల్లో ఏకకాలంలోనే దాడులు జరిగాయని, పక్కా ప్లాన్‌ ప్రకారమే చేశారని బండి సంజయ్‌ ఆరోపించారు. అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా చూడాలని, కానీ ఆలా జరగడం లేదని మండిపడ్డారు. తక్షణమే సీఎం కేసీఆర్‌ భైంసాలో పర్యటించాలని, లేనిపక్షంలో ఎన్నికల తర్వాత భైంసా భరోసాయాత్ర తాను చేస్తానని చెప్పారు బండి సంజయ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story