Tarun Chugh: ఇది ట్రైల‌రే... సినిమా వేరే!

Tarun Chugh: దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరిక జస్ట్‌ ట్రయిలర్‌ మాత్రమేనని అన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 4:39 PM IST
Tarun Chugh Comments On TRS
X

Tarun Chugh: ఇది ట్రైల‌రే... సినిమా వేరే!

Tarun Chugh: దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరిక జస్ట్‌ ట్రయిలర్‌ మాత్రమేనని అన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందని, కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌కు బీ టీమ్‌గా ఉందని విమర్శించారు. నిన్న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే దాసోజు శ్రవణ్‌ పార్టీలో చేరిక తేదీని వెల్లడిస్తామన్నారు తరుణ్‌చుగ్‌.

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ బండి సంజయ్. డబ్బులిచ్చి పార్టీలో చేర్పించుకునే సంస్కృతి తమది కాదన్న బండి అలాంటి రాజకీయాలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ చేస్తాయన్నారు. సోనియాను తిట్టినవాళ్లు ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారంటూ విమర్శించారు బండి సంజయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story