వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం

X
Highlights
* ప్రభుత్వాసుపత్రి బాత్రూంలో ప్రసవం..శిశువు మృతి * ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన గర్భిణీ * వైద్యులు లేరని చెప్పిన సిబ్బంది * తీవ్ర నొప్పులతో బాత్రూంలో డెలివరీ * సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్
admin23 Dec 2020 6:23 AM GMT
వికారాబాద్ జిల్లా తాండూరులో జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు ఊపిరి ఆగిపోయింది. డెలివరీ కోసం ఓ గర్భిణీ హాస్పిటల్‌కు రాగా.. డాక్టర్ అందుబాటులో లేరని చెప్పారు సిబ్బంది. దీంతో పురుటినొప్పులు పెరిగి.. ఆ గర్భిణీకి హాస్పిటల్ బాత్రూంలోనే డెలివరీ అయింది. సమయానికి చికిత్స అందక పుట్టిన శిశువు అక్కడే మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Web TitleTandoor District Hospital staff negligency created problems
Next Story