Talasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..

Talasani Srinivas Yadav: బీజేపీ నేతలు టూరిస్ట్‌లుగా వచ్చారని హైదరాబాద్‌ అభివృద్ధిని చూడాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

Arun Chilukuri
Updated on: 2 July 2022 9:01 PM IST
Talasani Srinivas Yadav Criticized the BJP
X

Talasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..

Talasani Srinivas Yadav: బీజేపీ నేతలు టూరిస్ట్‌లుగా వచ్చారని హైదరాబాద్‌ అభివృద్ధిని చూడాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి స్వాగతం పలికినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సీఎం తప్పనిసరిగా స్వాగతం పలకాలన్నది ఎక్కడా లేదన్నారు. గతంలో మోదీ వచ్చినప్పుడు కేసీఆర్‌ స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందన్నారు. దేశ అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రంలో బీజేపీ సిద్ధమైతే మేమూ రెడీ అంటూ తలసాని వ్యాఖ్యానించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story