Talasani Srinivas Yadav: కేటీఆర్‌ సీఎం కావడానికి ప్రధాని అవసరం ఏముంది?

Talasani Srinivas Yadav: కేసీఆర్, కేటీఆర్‌పై వ్యాఖ్యలు ఖండించిన మంత్రి తలసాని

Jyothi
Published on: 4 Oct 2023 10:32 AM IST
Talasani Srinivas Yadav Comments on Modi
X

Talasani Srinivas Yadav: కేటీఆర్‌ సీఎం కావడానికి ప్రధాని అవసరం ఏముంది?

Talasani Srinivas Yadav: నిజామాబాద్‌ టూర్‌లో సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేటీఆర్ సీఎం కావడానికి ప్రధాని అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రంనుంచి రావాల్సిన నిధులు గురించి ఎందుకు మాట్లాడరని ఫైర్ అయ్యారు తలసాని. మున్సిపల్ ఎన్నికల ముందు కేసీఆర్ కలిశారన్న మోడీ.. అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. అయినా వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి తలసాని విమర్శించారు.

Jyothi

Jyothi

Next Story