Talasani Srinivas: దమ్ముంటే బీజేపీ దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలి

Talasani Srinivas: ఎంపీగా బండి సంజయ్ హుజూరాబాద్‌కు ఏం చేశాడో చెప్పాలి..

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 6:02 PM IST
Talasani Srinivas Comments on BJP
X
తలసాని శ్రీనివాస్ యాదవ్ (ఫైల్ ఇమేజ్)

Talasani Srinivas: కేంద్రం నుంచి ఏదైనా ప్రాజెక్టు తెచ్చి బీజేపీ వాళ్లు హుజూరాబాద్‌లో మార్కెట్ చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి హుజూరాబాద్‌కు ఏం చేశాడో చెప్పాలన్నారు. మత్స్యకారులను, గంగపుత్రులను ఈటల ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. దళితబంధు హుజూరాబాద్ ఎన్నికల కోసం పెట్టలేదని రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. దమ్ముంటే బీజేపీని దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంచి మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు తలసాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story