L Ramana: రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు వచ్చాయి- ఎల్‌.రమణ

L Ramana: పదవుల కోసం పాకులాడలేవాడిని కాదని.. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు ఎల్‌.రమణ.

Arun Chilukuri
Updated on: 14 Jun 2021 1:20 PM IST
T-TDP President L Ramana Press Meet
X


L Ramana: రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు వచ్చాయి- ఎల్‌.రమణ

L Ramana: పదవుల కోసం పాకులాడలేవాడిని కాదని.. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు ఎల్‌.రమణ. రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు వచ్చాయని.. తాజా పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చానని.. 10 సార్లు టీడీపీ బీఫామ్‌పై పోటీ చేశానని ఎల్‌.రమణ తెలిపారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని చెప్పారు. తాను పదవుల కోసం ప్రతిపాదనలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని.. వాటిని ఖండిస్తున్నట్లు రమణ స్పష్టం చేశారు.

టీడీపీ, బీజేపీలు తనకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. తాను కూడా వారికి ఏమీ చెప్పలేదని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూ ఆ క్రమంలో ఇచ్చే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ముందుకెళ్తుంటానని తెలిపారు. ప్రజా జీవితంలో మరింత ముందుకెళ్లే విధంగా మంచి నిర్ణయంతో రావాలని పలువురు కోరుతున్నారన్నారు. రెండు పార్టీల ఆహ్వానంపై స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నానని.. ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రమణ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story