రేవంత్ కు పీసీసీ వ‌ద్దంటూ అధిష్టానానికి సీనియ‌ర్ల లేఖ‌

రేవంత్ కు పీసీసీ వ‌ద్దంటూ అధిష్టానానికి సీనియ‌ర్ల లేఖ‌
x
Highlights

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై ఆపార్టీ సీనియర్‌ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. లాయలిస్ట్‌ పేరుతో కాంగ్రెస్‌ అధినేత్రి...

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిపై ఆపార్టీ సీనియర్‌ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. లాయలిస్ట్‌ పేరుతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్‌రెడ్డికి ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్న నేతలు ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి వచ్చిన రేవంత్‌ను టీపీసీసీ ప్రెసిడెంట్‌ చేస్తే పార్టీలో ఎవరూ ఉండరని లేఖలో వెల్లడించారు.

దుబ్బాక ఎన్నికల్లో రేవంత్‌ ప్రచారం చేసినా పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు నేతలు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రేవంత్‌ ప్రభావం కనిపించలేదన్న పార్టీ సీనియర్ నేతలు దయచేసి రేవంత్‌ను పార్టీ ప్రెసిడెంట్‌గా నియమించవద్దు అంటూ విన్నవించారు. ఇక రేవంత్‌ టీడీపీలో ఉన్న సమయంలో సోనియాగాంధీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసినట్లు ప్రస్తావించారు. అదేవిధంగా అమరవీరుల సమాధులపై సోనియాగాంధీకి గుడికట్టాలని అన్న వ్యాఖ్యలను లేఖలో ప్రతిబింబించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు.


Show Full Article
Print Article
Next Story
More Stories