Congress: తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసిన టీ.కాంగ్రెస్‌ నేతలు

* తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలని మెమోరండం అందజేత

R Tripura Malini
Updated on: 21 Nov 2022 3:54 PM IST
T. congress leaders met telangana cs somesh kumar
X

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కలిసిన టీ.కాంగ్రెస్‌ నేతలు

Congress: తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను టీకాంగ్రెస్‌ నేతలు కలిశారు. సోమేష్‌కుమార్‌ను కలిసిన వారిలో రేవంత్‌రెడ్డి, భట్టి, జగ్గారెడ్డి, సీతక్క, ఇతర నేతలు ఉన్నారు. తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలని మెమోరండం అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతినే తీసుకురావాలని కోరారు. నిషేదిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలని తెలిపారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి పోడు భూములకు పట్టాలివ్వాలన్నారు. అర్హులకు అసైన్డ్ భూముల పట్టాలు ఇవ్వాలని కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని టీకాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story