రేవంత్‌ గేట్‌ టచ్‌ చేశాడు మిగతా నేతలు కనీసం ఆ వైపు రాలేదెందుకు?

రేవంత్‌ గేట్‌ టచ్‌ చేశాడు మిగతా నేతలు కనీసం ఆ వైపు రాలేదెందుకు?
x
Highlights

కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి స్టైలే వేరు. ఏం చేసినా, ఏం మాట్లాడినా పతాక శీర్షికలే. తాజాగా, ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమం, రేవంత్‌ రెడ్డి దూకుడుకు అద్దంపట్టింది.

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సొంతపార్టీలో తన మాట నెగ్గించుకున్నారా...? ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటన చేసిన తరువాత పార్టీలో సీనియర్లు ఆయన మాట వ్యతిరేకించినా ఒప్పించగిలిగాడా..? పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి ప్రకటన చేయించడంలో రేవంత్ కీలకంగా వ్యవహరించారా..? అందర్నీ ప్రగతి భవన్ బాట పట్టించిడంలో, తెర వెనక రేవంత్‌ ప్లే చేసిన స్ట్రాటజీ ఏంటి?

కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ రెడ్డి స్టైలే వేరు. ఏం చేసినా, ఏం మాట్లాడినా పతాక శీర్షికలే. తాజాగా, ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమం, రేవంత్‌ రెడ్డి దూకుడుకు అద్దంపట్టింది. అయితే, ముట్టడిని కట్టడి చేద్దామని, అధికార పార్టీనే కాదు, సొంత పార్టీ నేతలు కూడా స్కెచ్‌ వేశారట. కానీ తన ముట్టడిని కట్టడి చేయలేరని నిరూపించారు రేవంత్‌ రెడ్డి.

ఎట్టకేలకు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సొంతపార్టీలో తన మాటనెగ్గించుకున్నారన్నారు. ఆర్టీసి కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే తాము ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రకటన చేసి, పార్టీని ఆ వైపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారనే చర్చ కాంగ్రెస్ పార్టీలోనే జోరుగా వినిపిస్తోంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో ఆర్టీసి సమ్మెపై మాట్లాడిన రేవంత్, ప్రభుత్వం మెుండి వైఖరిని వీడకుంటే ఈనెల 21వ తేదిన ప్రగతిభవన్ ముట్టడిస్తామని పార్టీలో చర్చించకుండానే ప్రకటన చేశారు. అయితే, అందుకు పార్టీని ఒప్పించడానికి రేవంత్‌ అష్టకష్టాలు పడ్డారన్న చర్చ జరుగుతోంది.

కాని రేవంత్ రెడ్డి ప్రకటన తరువాత సొంతపార్టీలో సీనియిర్లు, రేవంత్ తన సొంత ఎజెండానే పార్టీపై రుద్దుతున్నారని విమర్శలు చేశారు. రేవంత్ ప్రగతిభవన్ ముట్టడిస్తామని ప్రకటన చేసిన తరువాత పార్టీ సీనియర్ నేత విహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఆయన ప్రకటన చేస్తే, మేము ముట్టడిలో పాల్గొనాలా అంటూ ప్రశ్నలు వేశారు. దీంతో రేవంత్ హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారం ముగియగానే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ప్రగతిభవన్ ముట్టడికి పార్టీ నేతలంతా పాల్గొనాలని ప్రకటన చేయించారట. దీంతో విధిలేని పరిస్థితిలో పార్టీలో సీనియర్లంతా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు.

అయితే, స్వయంగా ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. చాకచక్యంగా పోలీసుల నంచి తప్పించుకుని, ప్రగతి భవన్‌ దగ్గర ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్‌ నేతలందర్నీ గృహనిర్భంధం లేదంటే, ఎక్కడిక్కడ అరెస్టు చేస్తుండటంతో, రేవంత్‌ను కూడా గృహ నిర్భంధం చేస్తారని అందరూ అనుకున్నారు. ఆయన ఇంటి దగ్గర గేటు బయట పోలీసులు కూడా, వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఓపిక పట్టి, ఓపిక పట్టి, లోపలా బయటా తన అనుచరులను అక్కడక్కడా మోహరింపజేసి, కరెక్టు టైం చూసుకుని పరుగు స్టార్ట్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.

రేవంత్‌ సడెన్‌గా గేటు బయటకు రావడం, వెంటనే పరుగు లంఖించుకోవడంతో పోలీసులు సైతం షాకయ్యారు. పట్టుకునే ప్రయత్నం చేసినా, లాఘవంగా తప్పించుకుని, పరుగులు పెట్టారు. ఒక మూల మలుపులో తన అనుచరుడి వాహనం ఎక్కి, ప్రగతి భవన్‌ దగ్గర ప్రత్యక్షమయ్యారు. రేవంత్‌ కోసం రెడీగా వున్న పోలీసులు, వెంటనే పట్టుకుని అరెస్టు చేశారు. అయితే, తాను అనుకున్నది సాధించానని, గేట్ టచ్‌ చేశానని అన్నారు రేవంత్‌. మొత్తానికి రేవంత్‌ ముట్టడి ఎపిసోడ్‌, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠగా సాగింది.

పట్టుబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలీసుల నుండి తప్పించుకొని ప్రగతి భవన్ ముందు అరెస్టు అయ్యారు రేవంత్. తాను పిలుపునిచ్చి, తనే ప్రగతి భవన్ వెళ్లకుంటే కార్యకర్తల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతందని, రిస్క్ అయ్యినా ధైర్యం చేసి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారని కొందరు కాంగ్రెస్ నేతలు మెచ్చుకుంటున్నారు. ప్రగతి భవన్ ముట్టడితో పార్టీలో నేతల్లో కూడ కొత్త జోష్ వచ్చిందని చెప్పుకుంటున్నారట.

రేవంత్ అనుసరించిన వ్యూహం అందరు నేతలు అనుసరిస్తే తెలంగాణలో కాంగ్రెస్ కి ఎప్పటికీ ఢోకా ఉండదని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. కానీ, ముట్టడితో రేవంత్‌ పేరు మారుమోగడంతో, కొందరు సీనియర్లు మండిపోతున్నారట. అసలు పార్టీ అజెండా కాకుండా, రేవంత్ తన సొంత అజెండాను అనుసరిస్తున్నారని, ఫైరవుతున్నారట. ఎవరిని అడిగి, ముట్టడి కార్యక్రమం తలపెట్టారని, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క దగ్గర పంచాయతీ పెట్టారట కొందరు నేతలు. వి. హనుమంత రావు, మధుయాష్కీ, వంశీచందర్‌‌తో పాటు కొందరు నేతలు, భట్టిని కలిసి, రేవంత్‌ తీరును ఖండించారట. పార్టీ కాకుండా, సొంత అజెండాతో హైలెట్‌ కావాలనుకుంటున్నారని, రేవంత్‌పై కారాలు మిరియాలు నూరారట. దీనిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేస్తామని అన్నారట నేతలు. మొత్తానికి ముట్టడి కార్యక్రమంలో హల్‌చల్‌ చేసిన రేవంత్‌‌ రెడ్డిని, పార్టీలో కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం రగిలిపోతున్నారు. చూడాలి, రేవంత్‌ ముట్టడి ఎపిసోడ్ గాంధీభవన్‌లో ఇంకెలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories