Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాతో టచ్‌లో ఉన్నారు

Bandi Sanjay: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని వెల్లడి

Jyothi
Updated on: 4 Aug 2022 1:05 PM IST
T BJP Chief Bandi Sanjay Comments
X

టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కామెంట్స్

Bandi Sanjay: టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టచ్‌లో ఉన్నారని తెలిపారు. వెంకట్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉన్నారని భువనగిరిలో మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు. ఇప్పటికే బీజేపీలోకి చేరేందుకు రాజగోపాల్‌రెడ్డి సిద్ధమయ్యారు. రాజగోపాల్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు అంటూ రేవంత్‌రెడ్డి సంబోధించడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోదరుడిపై అవినీతి ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత వెంకట్‌రెడ్డి కూడా టచ్‌లో ఉన్నారని సంజయ్ అన్నారు.

అలాగే తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నాయని, 10 నుంచి 15 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమయ్యారని బండి సంజయ్ అన్నారు. మునుగోడులో తప్పకుండా బీజేపీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో చికోటి వ్యవహారం నడుస్తోందని, క్యాసినో వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story