Sangareddy: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. ఏమైందంటే..?

Sangareddy: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. ఏమైందంటే..?
x

Sangareddy: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. ఏమైందంటే..?

Highlights

Sangareddy: స్థానిక సంస్థల ఎన్నికలవేళ సర్పంచ్ అభ్యర్థి అనుమానస్పద మృతి కలకలం రేపింది.

Sangareddy: స్థానిక సంస్థల ఎన్నికలవేళ సర్పంచ్ అభ్యర్థి అనుమానస్పద మృతి కలకలం రేపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంషోద్దిన్ పూర్లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పాడ్ పల్లి గ్రామానికి చెందిన రాజు.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు.. నమ్మకద్రోహం చేస్తున్నారని రాజు వాపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదే విషయాన్ని తమ పార్టీకి చెందిన వారితో చెప్పుకొని బాధపడ్డారని స్థానికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం చెట్టుకు ఉరివేసుకొని రాజు ఆత్మహత్యకు పాల్పడటంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజు మృతి అనుమానాస్పదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories