Etela Rajender: ఈటల రాజేందర్ పాదయాత్రపై సస్పెన్స్..?

Etela Rajender: ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాదీవెన యాత్రపై సస్పెన్స్ నెలకొంది.

Arun Chilukuri
Updated on: 2 Aug 2021 3:13 PM IST
Suspense Over Etela Rajender Padayatra ?
X

Etela Rajender: ఈటల రాజేందర్ పాదయాత్రపై సస్పెన్స్..?

Etela Rajender: ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాదీవెన యాత్రపై సస్పెన్స్ నెలకొంది. పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన మోకాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ఉండనున్నారు.

వారం, పది రోజుల తర్వాత డాక్టర్ సూచన మేరకు పాదయాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో 22 నుంచి 25 రోజుల పాటు నియోజకవర్గం మొత్తం ప్రజాదీవెన పేరుతో పాదయాత్ర ఉంటుందని ముందు ప్రకటించారు. మధ్యలో ఈటల అస్వస్థతకు గురికావడంతో 12 రోజులకే బ్రేక్ పడింది. అయితే ఈటల కోలుకున్నాక పాదయాత్ర తిరిగి కొనసాగిస్తాడని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story