ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై ఉత్కంఠ.. అధిష్టానం ఏవైపు?

Congress: ఢిల్లీలో కొనసాగుతోన్న ఖమ్మం టికెట్ పంచాయితీ

Jyothi
Published on: 24 April 2024 10:01 AM IST
Suspense in Congress Khammam MP Ticket
X

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌పై ఉత్కంఠ.. అధిష్టానం ఏవైపు?

Congress: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్‌ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికీ టికెట్‌పై క్లారిటీ రాలేదు. ఓ వైపు భట్టి, మరోవైపు పొంగులేటి తమ వారికి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. దీంతో ఢిల్లీలో ఈ స్థానం టికెట్‌పై పంచాయితీ కొనసాగుతోంది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ అభ‌్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు అయిన రామసాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక తన సతీమణి నందినికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు భట్టి.

అయితే సామాజిక వర్గం వారీగా టికెట్‌పై అధిష్టానం సమాలోచనలు జరుపుతోంది. ఇవాళ రాత్రి వరకు టికెట్‌పై నిర్ణయం కూడా తీసుకోనున్నట్టు సమాచారం. రాత్రికి లేదా రేపు ఉదయం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉండటంతో.. ఖమ్మం టికెట్‌ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ రేగుతోంది.

Jyothi

Jyothi

Next Story