దీక్షిత్ కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ.. రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్

X
Highlights
మూడు రోజులైనా దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడలేదు. మూడు రోజులుగా గాలిస్తున్నా బాలుడి ఆచూకీ లభించలేదు....
Arun Chilukuri21 Oct 2020 7:16 AM GMT
మూడు రోజులైనా దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడలేదు. మూడు రోజులుగా గాలిస్తున్నా బాలుడి ఆచూకీ లభించలేదు. ఆదివారం రాత్రి బాలుడిని ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు 45 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. రెండు రోజులుగా ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు.
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు కిడ్నాప్ కావటంతో దీక్షిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు రోజులుగా కనీసం కిడ్నాపర్ల నుంచి కూడా ఫోన్ కాల్ రాకపోవటంతో తమ బాలుడి పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.
ఇక ఈ కేసును ఛేదించేందుకు పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అనుమానితులను విచారించినా ఎలాంటి ఫలితం లేకపోవటంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది. నిందితుల ఆచూకీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేసింగ్ మొదలుపెట్టారు.
Web TitleSuspense Continues In Minor Boy Kidnap Case in Mahabubabad District
Next Story