ఆన్ లైన్ చదువులపై సర్వే.. ఏం చెబుతోంది?

ఆన్ లైన్ చదువులపై సర్వే.. ఏం చెబుతోంది?
x
Highlights

కరోనా మ‌హమ్మారి విద్యా రంగం పై తీవ్ర ప‌్రభావం చూపుతోంది. విద్యార్ధుల చదువు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి...

కరోనా మ‌హమ్మారి విద్యా రంగం పై తీవ్ర ప‌్రభావం చూపుతోంది. విద్యార్ధుల చదువు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానితో పాటు 9, 10 వ తరగతి విద్యార్దులు అవసరం ఉంటే పాఠశాలలకు రావచ్చు అనే సూచన కూడా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్కూళ్లలో సర్వే ఎలా జరగుతుంది. ఉపాధ్యాయులు ఏమంటున్నారనే విషయాన్ని తెలుసుకుందాం.

క‌రోనా కారణంగా స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి కనపడడం లేదు. ఈ నేపథ్యంలో తరగతులు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అందులో భాగంగా సెప్టెంబ‌ర్ 1 నుంచి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇక తొమ్మిది, పదో తరగతి చదివే విద్యార్దులు తమకున్నడౌట్‌లను క్లారిఫై చేసుకునేందుకు పాఠశాలలకు రావచ్చని చెప్పారు. అయితే వారి తల్లిదండ్రుల అనుమతితో స్కూల్ కు రావచ్చని ఆదేశాలు జారీ చేశారు.

ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్దులు పాఠాలు వింటున్నారా లేదా అని తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల లోనికి వెళ్లి సర్వే చేయాలని అధికారులకు సూచించింది. దీంతో అధికారులు రంగంలో దిగారు. రాష్ట్రంలో సుమారు 28,000 ప్రభుత్వ విద్యా సంస్థలలో సుమారు 30 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుకొంటున్నారు. వారిలో సుమారు 50 నుంచి 65 శాతం మంది ఇళ్ళలో టీవీలు, కేబిల్ లేదా డిష్ కనెక్షన్స్ ఉన్నట్లు సర్వేలో తేలింది. కాబట్టి ఇళ్ళలో టీవీలు లేని మిగిలిన విద్యార్దులకు పాఠాలు ఏవిధంగా భోదించాలి? స్కూళల్లోకి విద్యార్దులకు అనుమతి వచ్చిన తరువాత మళ్లీ మొదటి నుంచి భోదన చేయాలా లేదా అనేది అర్దం కాని పరిస‌స్థితి ఉందని అంటున్నారు ఉపాద్యాయులు.

అయితే ప్రస్తుత పరిస్థితులలో విద్యార్దులను పాఠశాలలకు రప్పించడం సాధ్యం కాదు. ఆన్ లైన్ క్లాసులకు మించిన మార్గం లేదు. కాబట్టి విద్యాశాఖ, ఉపాద్యాయులు, విద్యార్దులు, వారి తల్లితండ్రులు అందరూ పరస్పరం సహకరించుకొంటూ విద్యార్ధులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories