తెలంగాణలో అన్ని పార్టీలకు సర్వే ఫీవర్‌

*సర్వేల మీద సర్వేలు చేస్తున్న వివిధ సంస్థలు, పార్టీలు, లీడర్లు

Rama Rao
Published on: 15 July 2022 10:44 AM IST
Survey Fever for All Parties in Telangana
X

తెలంగాణలో అన్ని పార్టీలకు సర్వే ఫీవర్‌

Telangana: తెలంగాణలో ఇప్పుడు సర్వే కాలం నడుస్తోంది. వివిధ సంస్థలు సర్వేలు చేయడం కామనే అయినా ఇప్పుడు అన్ని పార్టీలు ఇష్యూ బేస్‌డ్‌ సర్వేలు కూడా చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాయి. పార్టీల సర్వేలతో సంబంధం లేకుండా లీడర్లు సైతం సొంత సర్వేలు చేసుకుంటూ భవిష్యత్‌ గురించి ఆలోచనలో మునిగితేలుతున్నారు. వీక్‌గా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్న పార్టీలు ప్రత్యర్థి పార్టీలు ఎదగకుండా ఉండేందుకు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తిరుగులేదని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. తమకు టీఆర్ఎస్‌తోనే ముఖాముఖి పోటీ ఉంటుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అసలు టీఆర్ఎస్, బీజేపీ చేసుకుంటున్న, చేయించుకుంటున్న సర్వేలు ఏమాత్రం ప్రజల్లో ప్రభావితం చూపవని ఎన్నికల్లో తమ బలం ఏంటో తెలుస్తుందని కాంగ్రెస్ అంటోంది.

Rama Rao

Rama Rao

Next Story