Konda Surekha: మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ కంటతడి

Konda Surekha: గౌరవప్రదంగా వేసిన దండను ట్రోల్ చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 Sept 2024 9:42 PM IST
Surekha shed tears at the media conference
X

Konda Surekha: మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తనకు దండ వేసిన సందర్భాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడంపై ఆమె మనస్తాపం చెందారు. గౌరవంగా వేసిన దండను ట్రోల్ చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్నటి నుంచి తాను భోజనం చేయలేదని, నిద్రపోలేదన్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని విమర్శించారు. ఆ పార్టీ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు.

ఇప్పుడే కాదని మొదటి నుంచి కూడా కేసీఆర్ మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారని కూడా అవమానించారని గుర్తుచేశారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story