Krishna River Dispute: కృష్ణా జలాల వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
Krishna River Dispute: సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది.
Krishna River Dispute: కృష్ణా జలాల వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
Krishna River Dispute: సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్రం.. ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే.. కౌంటర్ దాఖలుకు కేంద్ర జలశక్తి శాఖ గడువు కోరడంతో తదుపరి విచారణ జనవరి 12కు వాయిదా పడింది.
Next Story




