Mano Vignana Yatra 2022: సూర్యాపేట జిల్లాలో మనోవిజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra 2022: యువతకు విజ్ఞానాన్ని స్ఫూర్తిని అందిస్తూ సాగుతున్న మనో విజ్ఞాన యాత్ర, సూర్యాపేట జిల్లాకు చేరుకుంది.

Arun Chilukuri
Updated on: 26 Nov 2022 6:42 PM IST
SUPAR Foundation Mano Vignana Yatra 2022 in Suryapet
X

Mano Vignana Yatra 2022: సూర్యాపేట జిల్లాలో మనోవిజ్ఞాన యాత్ర

Mano Vignana Yatra 2022: యువతకు విజ్ఞానాన్ని స్ఫూర్తిని అందిస్తూ సాగుతున్న మనో విజ్ఞాన యాత్ర, సూర్యాపేట జిల్లాకు చేరుకుంది. స్థానిక ఎస్వీ కళాశాలలో వివిధ అంశాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఒత్తిళ్లతో సతమతమయ్యేవారు ఏ విధంగా బయటపడాలో కార్యక్రమంలో సలహాలు, సూచనలు చేశారు. hmtv మీడియా పార్ట్‌నర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమానికి.. యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.

జీవితంలో ఎదురయ్యే మానసిక అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థిక, సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో ఉన్నత శిఖరాలను అంధిరోహించడమే లక్ష్యంగా ప్రారంభమైంది మిషన్ మనో విజ్ఞాన యాత్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో 30 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర, ఎడిట్ పాయింట్ అధినేత రమేశ్ ఇప్పలపల్లి, ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండ వారి రంగాలకు సంబంధించిన విలువైన సూచనలు, సలహాలు ఇస్తారు.

ఎలాంటి ప్రవేశ రుసుం లేని ఈ ఉచిత సెషన్లలో పాల్గొనడానికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి.

రిజిస్ట్రేషన్ లింక్: www.manovignanayatra.com



Arun Chilukuri

Arun Chilukuri

Next Story