తెలంగాణ మహిళా కమిషన్ నియామకం..‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

admin
Published on: 27 Dec 2020 9:57 PM IST
తెలంగాణ మహిళా కమిషన్  నియామకం..‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి
X

తెలంగాణ మహిళా కమిషన్‌గా సునీతా లక్ష్మారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆమె కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. త్వరలో ఆమె తెలంగాణ మహిళా కమిషన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. చైర్ పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. చైర్ పర్సన్‌తో పాటు మరో 6 మంది సభ్యులను కూడా నియమించారు. సభ్యులుగా షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధామ్ లక్ష్మీ, కటారి రేవతీ రావు నియమితులయ్యారు. సభ్యుల పదవీకాలం కూడా ఐదేళ్లు ఉండనుంది.

admin

admin

Next Story