Sundarayya Vignana Kendram: ఐసోలేషన్ కేంద్రంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం

Sundarayya Vignana Kendram as Isolation Center
x

సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఫైల్ ఇమేజ్)

Highlights

Sundarayya Vignana Kendram: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 20 బెడ్లు * పేద వారి కోసం ఐసోలేషన్‌ కేంద్రం- సీపీఎం

Sundarayya Vignana Kendram: పోరాటాల్లోనే కాదు సేవలోనూ తాము ముందుంటామంటున్నారు వామపక్ష నేతలు. కోవిడ్‌ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న పేషంట్లకు తామున్నామని భరోసా ఇస్తూ.. పేదల కోసం తమ వంతు సేవ చేస్తున్నారు. సమావేశాలు, సభలకు వేదికైన సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని.. ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చారు. ఐసోలేషన్ వార్డులో 20 బెడ్లు ఏర్పాటు చేసిన సీపీఎం నేతలు వారికి వైద్యం, ఆహార సదుపాయాలు కల్పించారు. ఉచితంగా భోజనం, మందు కల్పిస్తూ కష్టకాలంలో భరోసా ఇస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హాస్పిటల్‌కు వెళ్లినా బెడ్లు దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ బెడ్లు ఉన్నా ఎమర్జెన్సీలో ఉన్న కోవిడ్ పేషంట్లకు కేటాయిస్తున్నారు. దీంతో మైల్డ్ సింప్టమ్స్‌ ఉన్న వారికోసం ఐసోలేషన్ ఏర్పాటు చేసింది సీపీఎం రాష్ట్ర కమిటీ. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో త్వరలో మరో ఐసోలేషణ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ప్రతీ జిల్లాలోనూ సీపీఎం పార్టీ నేతలు ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories