హైదరాబాద్‌లో ఐసిస్‌ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్‌

ISIS Terrorist: హైదరాబాద్‌ పాతబస్తీలో ఐసిస్‌ సానుభూతిపరుడు సులేమాన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Arun Chilukuri
Published on: 2 April 2022 5:21 PM IST
Suleiman Arrested for Allegedly Trying to Contact ISIS
X

హైదరాబాద్‌లో ఐసిస్‌ కలకలం.. సానుభూతిపరుడు అరెస్ట్‌

ISIS Terrorist: హైదరాబాద్‌ పాతబస్తీలో ఐసిస్‌ సానుభూతిపరుడు సులేమాన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. సోషల్‌ మీడియాలో ఐసిస్‌ తీవ్రవాదంపై సులేమాన్‌ ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌లో ప్రచారం, పోస్టులు పెడుతున్న సులేమాన్‌ను ఐపీ అడ్రస్‌ ఆధారంగా పాతబస్తీలో అదుపులోకి తీసుకున్నారు. సులేమాన్‌ పేరుపై 20 సోషల్‌ మీడియా అకౌంట్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలు మరోసారి తెరమీదకు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక లతో ఎన్‌ఐఏ, హైదరాబాద్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story