సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం

*భూ ఆక్రమణ వివాదంలో పోలీసులు స్పందించలేదని ఆందోళన

Rama Rao
Updated on: 19 Sept 2022 3:15 PM IST
Suicide Attempt in Suryapet Collector Office | TS News
X

సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ ఆక్రమణ వివాదానికి సంబంధించి పోలీసులు స్పందించలేదని ఆందోళనకు దిగారు. గరిడేపల్లి పోలీసుల నిర్లక్ష్యంవల్ల భూ ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భూ వివాద సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో మనస్తాపానికి గురైన కుటుంబీకులు నలుగురు కలెక్టరేట్ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ మోహన్‌రావు సమక్షంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామని హెచ్చరిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భూ వివాద సమస్యపై విచారించి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు భరోసా ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story