రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత

* హైదరాబాద్‌లోని అపోలోలో చేరిన రజనీకాంత్ * హైబీపీతో బాధపడుతున్న రజనీకాంత్

admin
Updated on: 25 Dec 2020 1:37 PM IST
రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలోలో రజనీకి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హైబీపీతో రజనీ బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

10 రోజుల క్రితం సినిమా షూటింగ్‌లో భాగంగా సిబ్బందికి కరోనా టెస్టులు చేయించగా.. వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రజనీకాంత్‌ కూడా టెస్టులు చేయించుకోగా.. నెగిటివ్‌ అని వచ్చింది. అయినప్పటికీ రజనీ.. ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే.. ఇవాళ హైబీపీ బాధపడుతున్న ఆయన.. ఆపోలోలో జాయిన్ అయ్యారు.

అన్నాత్తే సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చారు రజనీకాంత్ అండ్ టీమ్. అయితే.. షూటింగ్‌లోని పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడంతో షూటింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఈ నెల 22న రజనీ కూడా కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ అని వచ్చింది. ఇవాళ ఉదయం హైబీపీతో తీవ్ర ఇబ్బంది పడ్డ రజనీ.. వెంటనే బయల్దేరి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. రజనీకాంత్‌ వెంటే తన కూతురు ఐశ్వర్య కూడా ఉంది.

మరోవైపు సూపర్‌ స్టార్‌ అస్వస్థతకు గురవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపోలో ఆస్పత్రికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

admin

admin

Next Story