బల్లి పడ్డ ఆహారం తిని అస్వస్థతకు గురైన ఇరవై ఐదు మంది విద్యార్థినిలు
*జనగామ ఏరియా ఆస్పత్రికి 12 మంది విద్యార్థినుల తరలింపు
బల్లి పడ్డ ఆహారం తిని అస్వస్థతకు గురైన ఇరవై ఐదు మంది విద్యార్థినిలు
Telangana: జనగామ జిల్లా దేవరుప్పుల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లి పడ్డ ఆహారం తిన్న బాలికలు వాంతులు, విరోచనాలతో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన పన్నెండు మంది విద్యార్థినిలను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను అదనపు కలెక్టర్ అబ్ధుల్ హమీద్ పరామర్శించారు. ఎవ్వరూ ఖంగారు పడొద్దని ఆయన ధైర్య వచనాలు చెప్పారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
Next Story




