TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌పై వర్షాల ఎఫెక్ట్

TS EAMCET: భారీ వర్షాలతో విద్యార్థులు రాలేని పరిస్థితి

Jyothi
Updated on: 13 July 2022 12:54 PM IST
Students Facing Problems Due To Heavy Rains
X

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌పై వర్షాల ఎఫెక్ట్

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌పై సందిగ్ధత నెలకొంది. భారీ వర్షాలతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో పరీక్ష నిర్వహణ కష్టమని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం రేపు, ఎల్లుండి అగ్రికల్చర్‌ పరీక్ష, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్ష జరగాల్సి ఉంది. ఇదే విధంగా వర్షాలు కొనసాగితే పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story