సమ్మర్‌ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు

Students Enjoying the Summer Holidays | Hyderabad
x

సమ్మర్‌ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు

Highlights

*కరోనా తగ్గుముఖం పట్టడంతో రద్దీగా కనిపిస్తున్న గేమింగ్, షాపింగ్, పర్యాటక ప్రాంతాలు

Summer Holidays: సమ్మర్ హాలిడేస్ మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. దీంతో వీకెండ్స్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు విద్యార్థులు. వీకెండ్స్‌లో ఫ్యామిలీస్​, ఫ్రెండ్స్ వెళ్లి ఎంజాయ్ చేయడంతో నగరంలో​సందడి వాతావరణం నెలకొంది. హాలీడేస్ ముగింపు దగ్గర పడుతుండటంతో గేమింగ్, షాపింగ్, పర్యాటక ప్రాంతాలు కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. స్పెషల్ ప్రదర్శనలు, కార్నివాల్స్, క్యాంప్‌లు కొనసాగుతుండగా పిల్లలకు బోలెడన్నీ ఆటలు, పెద్దలు షాపింగ్‌లతో బిజిబిజీగా గడుపుతున్నారు.

మళ్లీ పాత రోజులు వచ్చేశాయి. గత రెండు సమ్మర్ హాలిడేస్‌లలో కరోనా భయంతో అడుగు బయటపెట్టని నగర వాసులు ఈసారి బయటకు వచ్చారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తుంది. గోల్కొండ కోట, చార్మినార్‌, ఫలక్‌నుమా ప్యాలెస్‌, మక్కా మసీదు లాంటి చారిత్రక కట్టడాలను వీక్షించేందుకు సందర్శకులు రోజురోజుకు పెరుగుతున్నారు. వచ్చే వారంలో స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకోనుండడంతో విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

శిల్పారామంలోని సమ్మర్ క్యాంప్‌ చిన్నారులు, పెద్దలను నైపుణ్యంగా తీర్చిదిదుతుంది. వేసవి సెలవుల సందర్భంగా సమ్మర్ ఫెస్టివల్ క్యాంపుని ఏర్పాటు చేశారు. చిన్నారులు, పెద్దలకు మట్టి కుండల తయారీ, మట్టి బొమ్మలు, మధుబని, నిర్మల్, ఆక్రేలిక్​, ట్రైబల్ పెయింటింగ్‌లో శిక్షణ ఇచ్చారు. చాలా మంది విద్యార్థులు ఈసారి సంస్కృతం నేర్చుకోవడం, భగవద్గీత శ్లోకాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక అలాంటి క్లాస్‌లన్నీ పూర్తికావడంతో ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి బయటకు వస్తున్నారు. ఈసారి ఫ్యామిలీతో సమ్మర్ ఉత్సవ్ మేళాకు వెళ్లామని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఈ నెల 13 నుంచి వచ్చే విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో.. హాలీడేస్‌ను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories