Sabitha Indra Reddy: మంత్రి సబిత ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

Sabitha Indra Reddy: ఇంజనీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌

Sandeep Eggoju
Published on: 5 July 2021 10:51 AM IST
Students Demand to Cancel the Degree and Engineering Exams
X

మంత్రి సబితా ఇంద్ర రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Sabitha Indra Reddy: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని జేఎన్‌టీయూ, ఓయూ విద్యార్థులు ముట్టడించారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులందరూ దాదాపు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటారని.. అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకోని నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని నిరసన తెలిపారు. ఈ క్రమంలో మంత్రి జోక్యం చేసుకొని ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కొద్దిమంది విద్యార్థులతో మాట్లాడి.. ఇప్పటికే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్ష కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని చెప్పారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story