MLA Raja Singh: మర్డర్‌ చేసినవారికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ జానీమాస్టర్‌కు ఇవ్వాలి

MLA Raja Singh: జానీ మాస్టర్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2024 1:38 PM IST
Strict Action Should Be Taken Against Johnny Master Says MLA Raja Singh
X

MLA Raja Singh: మర్డర్‌ చేసినవారికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ జానీమాస్టర్‌కు ఇవ్వాలి

MLA Raja Singh: జానీ మాస్టర్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. జానీ మాస్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. మర్డర్ చేసిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో.. జానీ మాస్టర్‌కు అలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్నారు. జానీ మాస్టర్ కేసులో పోలీసులు కఠినంగా ఉండాలన్నారు. జానీ మాస్టర్ సినీ పరిశ్రమకు మచ్చ తెచ్చారని.. సినీ పరిశ్రమ నుంచి జానీ మాస్టర్‌ను బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.

జాని మాస్టర్ ది లవ్ జిహాదీ అన్నారు. ఆయన ఇంకా ఎంత మంది అమ్మాయిల ను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఇలాంటివి చేసిన వారినీ కఠినంగా శిక్షించాలని కోరారు.

కాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైద్రాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు గోవాలో గురువారం అదుపులోకి తీసుకున్నారు. పిటి వారెంట్ పై ఆయనను హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై రేప్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. నెల్లూరు, లడాఖ్ లలో జానీ మాస్టర్ ఉన్నారనే సమాచారంతో ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి వెళ్లాయి. అయితే గోవాలో ఆయన ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story