logo
తెలంగాణ

వీధి వ్యాపారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఒకో వ్యాపారికి రూ.10 వేలు రుణం మంజూరు

వీధి వ్యాపారులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఒకో వ్యాపారికి రూ.10 వేలు రుణం మంజూరు
X
Highlights

street vendors to get a loan: రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా కానుంది. దాదాపు 5 ల‌క్షల...

street vendors to get a loan: రాష్ట్రంలోని వీధి వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా కానుంది. దాదాపు 5 ల‌క్షల మంది వీధి వ్యాపారుల‌కు అండ‌గా నిలిచేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. రోడ్ల పక్క వ్యాపారం చేసుకునేవారికి కేసీఆర్ సర్కారు కల్పించే సదుపాయాలపై ఓ స్టోరీ.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇబ్బందులు ప‌డుతున్న వీధి వ్యాపారుల‌కు ఆర్థికంగా అండ‌గా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 ల‌క్షల మంది రోడ్లపై వివిధ వ్యాపారాలు చేస్తున్నట్లు ప్రభుత్వ అంచనా. వారిలో ప్రతీ ఒక్కరికీ పది వేలు చొప్పున రుణం మంజూరు చేయనున్నారు. బ్యాంకుల ద్వారా త‌క్కువ వ‌డ్డీతో రుణం మంజూరు చేయించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 16 వేల మంది వీధి వ్యాపారుల‌ పేర్లను న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

వీధి వ్యాపారుల స్థితిగతులను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రేటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎమ్సీ డీఎస్ లోకేష్ కుమార్ హైదరాబాద్ మెహిదీప‌ట్నంలోని రైతు బ‌జార్‌, దాని ప‌రిస‌ర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. రోడ్లపై వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి, ప్రత్యేక యాప్ ద్వారా పేర్లు న‌మోదు చేసుకొని గుర్తింపు కార్డులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఒకసారి న‌మోదు అయితే ప్రభుత్వం ద్వారా ప్రోత్సహకాలు పొందే అవ‌కాశం క‌లుగుతుంద‌ని తెలిపారు. న‌మోదుకు ఆధార్ కార్డు వివ‌రాల‌ను కూడా అంద‌జేయాల‌ని తెలిపారు. ప్రభుత్వం క‌ల్పించే ప్రయోజ‌నాల‌ను పొందేందుకు రాష్ట్రంలోని వీధి వ్యాపారులు త‌మ వివ‌రాల‌ను సర్వే కు వచ్చిన మున్సిప‌ల్ అధికారుల‌కు అంద‌జేయాల‌ని కోరారు. అయితే ఇప్పటి వరకు GHMC పరిధిలో 58 వేల 472 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వారిలో 50 వేల 913 మందికి ఐడి కార్డ్ లను అందచేశారు. వీరిలో లోన్ కోసం 16 వేల 27 మంది దరఖాస్తు చేసినట్లుగా GHMC అధికారులు సమాచారం ఇచ్చారు.

Web Titlestreet vendors to get a loan of Rs 10,000 each in Telangana
Next Story