Hyderabad: వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రెండున్నరేళ్ల బాలుడు...

Hyderabad: బడాబజార్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కరిచిన కుక్కలు...

Shireesha
Published on: 27 April 2022 9:07 AM IST
Street Dogs Killed 2 Years Boy in Golconda Police Station Area Today | Live News
X

Hyderabad: వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రెండున్నరేళ్ల బాలుడు...

Hyderabad: గోల్కొండ పోలీస్ స్టేషన పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో రెండున్నరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బడాబజార్ లోని ఇంటి ముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలుడిని వీది కుక్కలు కరిచాయి. చిన్నారి గొంతును కరవడంతో హుటాహుటిన నీలోఫర్ హస్పిటల్ తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు.

గతంలోనూ ఇదే ప్రాంతంలో వీధికుక్కలు బస్తీవాసులపై దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న మిలటరీ ఏరియాలో నుంచి ఈ శునఖాలు బస్తీలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story