Street Dogs: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైరవిహారం
Street Dogs: కుక్కల దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలు
Street Dogs: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైరవిహారం
Street Dogs: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల స్వైరవిహారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో జరిగిన కుక్కల దాడిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వరంగల్ జిల్లాలోని ఎల్బీనగర్, ఇస్లాంపూరాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు చెన్నంపల్లి ప్రాధమిక పాఠశాలలో విద్యార్థి పై కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల స్వైర విహారంపై ప్రజలు మండిపడుతున్నారు. పదేపదే ఘటనలు పునరావృతం అవుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




