Hyderabad: ఏడేళ్ల మూగబాలుడిపై వీధికుక్కల దాడి

Hyderabad: హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 11:54 AM IST
Hyderabad: ఏడేళ్ల మూగబాలుడిపై వీధికుక్కల దాడి
X

Hyderabad: ఏడేళ్ల మూగబాలుడిపై వీధికుక్కల దాడి

Hyderabad: హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. హయత్‌నగర్ డివిజన్ శివగంగ కాలనీలో ఏడేళ్ల మూగ బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగాగాయపడిన బాలుడు ప్రేమ్ చందర్ ను ఆసుపత్రికి తరలించారు. కాలనీలో వీధి కుక్కలు తరచూ తిరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు కుక్కలు స్థానికులను కరిచాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను బంధించి ఊరి చివరన వదిలి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story