TS BJP: గెలుపే టార్గెట్‌గా కమలం పార్టీ వ్యూహాలు.. వరుసగా ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ పిలుపు

TS BJP: ఈనెల 25న డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా

Shekhar G
Published on: 22 July 2023 2:57 PM IST
Strategies Of The Lotus Party As A Winning Target
X

TS BJP: గెలుపే టార్గెట్‌గా కమలం పార్టీ వ్యూహాలు.. వరుసగా ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ పిలుపు

TS BJP: వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా కమలం పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. వరుసగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈనెల 24న జిల్లా కేంద్రాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు, ఇక ఈనెల 25న డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యలపై ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళనలు నిర్వహించనున్నారు. రైతు రుణమాఫీ, ధరణి రద్దుపై ఉద్యమం చేపట్టాలని.. దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూములు సర్కార్‌ వెనక్కు తీసుకోవడంపై దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం 100 రోజుల ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

Shekhar G

Shekhar G

Next Story