"అయ్యయ్యో వద్దమ్మా" అంటున్నా "సుఖీభవ" అంటూ చితకబాదారు

* "అయ్యయ్యో వద్దమ్మా" ఫేమ్ డాన్సర్ శరత్ పై దాడి

Sandeep Reddy
Updated on: 19 Oct 2021 2:02 PM IST
Strangers Attacks on Ayyayyo Vaddamma Sukhibava Video Fame Dancer Sharath
X

 "అయ్యయ్యో వద్దమ్మా" ఫేమ్ డాన్సర్ శరత్ పై దాడి 

Hyderabad: "అయ్యయ్యో వద్దమ్మా" అంటూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్ అయిన డాన్సర్ శరత్ ని ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులు విచక్షణ రహితంగా చితకబాదారు. అతనిపై జరిగిన దాడి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు తాను చేసిన వీడియోలను ప్రమోట్ చేయండని వేడుకున్న శరత్.. ఒక్క అయ్యయ్యో వద్దమ్మ వీడియోతో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

అయితే హిజ్రాలు అతడిపై దాడి చేశారని మొదట వార్తలు వినిపించిన తాజాగా శరత్ తనపై దాడి జరిగిన విషయంపై స్పందించాడు. రెండేళ్ళ క్రితం తన చెల్లెలిని వేధించిన వారిని కొట్టానని, అందుకు జైలుకు కూడా వెళ్లానని.. తాను జైలు నుండి వచ్చాక తన డాన్స్ వీడియోలు మెచ్చి రెండు సినిమాలలో ఆఫర్లు రావడంతో పాటు ఇటీవలే "అయ్యయ్యో వద్దమ్మా" వీడియోతో పాపులర్ అవడంతో వాళ్ళే నన్ను కొట్టారని చెప్పుకొచ్చాడు. తనపై జరిగిన దాడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు శరత్ తెలిపాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story