Munugode Bypoll 2022: ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. పలివెలలో పరిస్థితి ఉద్రిక్తం

Munugode Bypoll 2022: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 1 Nov 2022 2:52 PM IST
Stones Attack on BJP MLA Etela Rajender Convoy in Palivela Village
X

Munugode Bypoll 2022: ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. పలివెలలో పరిస్థితి ఉద్రిక్తం

Munugode Bypoll 2022: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓ వైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు గన్‌మెన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story