బీజేపీ నాయకులు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇళ్లపై రాళ్ల దాడి...

DK Aruna - Jithender Reddy: రాళ్ల దాడిలో జితేందర్‌రెడ్డి కారు అద్ధాలు ధ్వంసం...

Shireesha
Published on: 3 March 2022 10:59 AM IST
Stone Attacks on BJP Leaders DK Aruna Jithender Reddy House | Telugu Online News
X

బీజేపీ నాయకులు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇళ్లపై రాళ్ల దాడి...

DK Aruna - Jithender Reddy: మహబూబ్‌నగర్‌లోని బీజేపీ నాయకులు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇళ్లపై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. డీకే అరుణ ఇంటిపై రాళ్లు, టైర్లు విసిరి దాడి చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయించేందుకు కుట్ర జరిగిందని.. కుట్రకు పాల్పడిన వారిని అరెస్టు చేశారు.

అయితే హత్యకు కుట్రపన్నిన వారిని.. ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇళ్లపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జితేందర్‌రెడ్డి ఇంటిపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Shireesha

Shireesha

Next Story