వరద ముప్పు తప్పాలంటే చెరువులను అనుసంధానం చేయాలి

వరద ముప్పు తప్పాలంటే చెరువులను అనుసంధానం చేయాలి
x
Highlights

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు వరదల బారినపడి మునిగిన విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో భారీ...

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని చాలా ప్రాంతాలు వరదల బారినపడి మునిగిన విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తులో భారీ వర్షాల నేపథ్యంలో నగరాన్ని వరదతలు ముంచెత్తే పరిస్థితి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఇంజినీర్లు, పలురంగాల నిపుణులు సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలాల పునరుద్ధరణ, ఆక్రమణలను తొలగించాలని పేర్కొన్నారు. నగర శివారు ప్రాంతాల్లోని 185 చెరువులను అనుసంధానించడం ద్వారా వరద నీటిని మళ్లించాలని సూచించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వరద నీటిని మూసీ నది పరీవాహక ప్రాంతంతో అనుసంధానం చేసి, ఆక్రమణలను తొలగిస్తే వరదను సులువుగా తరలించవచ్చని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కార మార్గాలను లోతుగా అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇటీవలనగరంలో కురిసిన భారీ వర్షాలకు 45 శాతం కాలనీలు మొదటిసారి, 35 శాతం కాలనీలు రెండోసారి, 10 శాతం కాలనీలు పలుమార్లు ముంపునకు గురయ్యాయని సర్వేలో వెల్లడైందని తెలిపారు. మూసీ నీటిని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి, భూమి నుంచి తరలించాలని సూచించారు. వరద సమస్య పరిష్కార మార్గాలపై త్వరలో సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లకు సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్య్రమానికి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ సత్తి రెడ్డి, వరంగల్ నిట్ మాజీ డైరెక్టర్ ప్రొ. పీజీ శాస్త్రి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జీ. రామేశ్వర్‌రావు, కార్యదర్శి అంజయ్య,ఇరిగేషన్ ప్రాజెక్టుల ఈ.ఎన్.సీ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ లేక్స్ ఎస్.ఈ. శేఖర్ రెడ్డి, డైరెక్టర్ ప్రొ. లక్ష్మణ్ రావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు అనురాధ రెడ్డి, సురేశ్‌ కుమార్, శ్రీనివాస్ కుమార్, ఐఐఐటీ ప్రొఫెసర్‌ ప్రదీప్ కుమార్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ హెడ్ ప్రొఫెసర్‌ గోపాల్ నాయక్, జేఎన్టీయూ మాజీ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్‌ సాయిబాబా రెడ్డి, జేఎన్టీయూ ప్రొఫెసర్‌ బాణోత్ రమణ నాయక్, నీరి డైరెక్టర్ డాక్టర్‌ షేక్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories