జంతువుల స్మశానవాటికలను ప్రారంభించిన మంత్రి

* పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్

R Tripura Malini
Updated on: 6 Dec 2022 12:57 PM IST
State Minister KTR Visits LB Nagar Constituency
X

రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటన

State Minister: రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. బండ్లగూడలో నాలా, ఫతుల్‌గూడలో లింక్ రోడ్డు, జంతువుల స్మశానవాటికలను మంత్రి ప్రారంభించారు. ఫతుల్‌గూడలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్.

ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 16 కోట్ల రూపాయలతో ముక్తి ఘాట్ నిర్మించామని తెలిపారు. 985 కోట్ల రూపాయలతో నాలాల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారాయన ఫిర్జాదిగూడ వద్ద 52 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 14 వంతెనలను నిర్మించనున్న మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story