Telangana: తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana: త్వరలో కమిషన్ చైర్మన్ , సభ్యుల నియామకం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Sept 2024 7:56 PM IST
Telangana: తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
X

Telangana: తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. కమిషన్ చైర్మన్ , సభ్యులను త్వరలో నియమించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story