Telangana Schools, Offices Holiday: రేపు స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Schools and Offices Holidays: తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా సోమవారం ప్రభుత్వ హాలీడేగా ప్రకటించింది. దీంతో సోమవారం పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 28 July 2024 1:08 PM IST
Telangana Schools and Offices Holiday: రేపు స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
X

Telangana Schools and Offices Holiday: రేపు స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Schools and Offices Holidays: తెలంగాణ సర్కార్ విద్యార్థులకు, ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. బోనాల పండగ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పండుగా బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం మూతపడనున్నాయి.

నేడు ఆదివారం సెలవు, రేపు కూడా పబ్లిక్ హాలుడే కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. కాగా జులై 7న హైదరాబాద్ లో ప్రారంభమైన బోనాల సంబురాలు ఆగస్టు 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బోనాలు అనగానే గుర్తుకువచ్చేది గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి అమ్మవారితోపాటు మరికొన్ని ప్రముఖ దేవాలయాలు గుర్తుకు వస్తాయి.

బోనాల జాతర దాదాపు శతాబ్దం కాలం నుంచి తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల పండగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. బోనాల పండగ వేళ తెలంగాణ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటున్నారు. ప్రతిఏటా ఈ బోనాల జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లకోసం బడ్జెట్ కేటాయించడంతో ఈ పండగకు మరింత ప్రత్యేకత ఏర్పడింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story