Telangana SSC: పదో తరగతి పరీక్షల పేపర్లు కుదింపు

Telangana SSC Exams 2021: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 11 Oct 2021 4:31 PM IST
SSC Exams to Have Only six Papers in Telangana
X

Telangana: పదో తరగతి పరీక్షల పేపర్లు కుదింపు

Telangana SSC Exams 2021: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షకు మార్పులు చేసింది. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లలోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ మేర‌కు ప‌ది ప‌రీక్ష‌ల విధానంపై విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్త‌ర్వులు జారీ చేశారు. వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story