Srinivas Goud: తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర మర్చిపోలేనిది

Srinivas Goud: రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్నిప్రజలకు వివరించడంలో.. సాయిచంద్ కీలక పాత్ర పోషించాడు

Jyothi
Published on: 29 Jun 2023 12:09 PM IST
Srinivas Goud Pays Tribute To Singer Sai chand
X

Srinivas Goud: తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర మర్చిపోలేనిది

Srinivas Goud: తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పోషించిన పాత్ర మర్చిపోలేనిదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, మనకు జరిగిన దోపిడిని ప్రజలకు వివరించడంలో సాయి చంద్ కీలక పాత్ర వహించాడన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఉద్యమ ఆకాంక్షను ప్రజాక్షేత్రానికి తెలియజెప్పిన గొప్ప ఉద్యమకారుడని తెలిపారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి చేరవేయడంలోనూ తన పాట ద్వారా ముఖ్య భూమిక పోషించాడన్నారు. ఎక్కడ ముఖ్య సమావేశం జరిగినా సాయిచంద్ తన పాటతో ప్రజలందరినీ అలరించేవాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సాయి చంద్ మృతి పాలమూరుకు, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story