Srinivas Goud: నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ర్పచారం ఉంది.. ఈ తరహా కేఫ్ ఏ రాష్ట్రంలోనూ లేదు

Srinivas Goud: హుస్సేన్‌సాగర్‌ తీరంలో నీరా కేఫ్ ప్రారంభం

Dhatripriya
Published on: 3 May 2023 3:35 PM IST
Srinivas Goud About Neera Cafe
X

Srinivas Goud: నీరా అంటే ఆల్కహాల్ అనే దుష్ర్పచారం ఉంది.. ఈ తరహా కేఫ్ ఏ రాష్ట్రంలోనూ లేదు

Srinivas Goud: హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. నీరా కేఫ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రులు ఆ పరిసరాలను కలియతిరిగారు. నీరా అంటే ఆల్కహాల్‌ అనే దుష్ప్రచారం ఉందని.. ఇది వేదామృతమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా కేఫ్‌ లేదని.. ఇది ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారాయన.. దాదాపు 20కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నీరా కేఫ్ ఏర్పాటు చేసింది. పల్లెను తలపించేలా పచ్చని వాతావరణంలో ఈ కేఫ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story